22 నుంచి చౌడేశ్వరి దేవి ఉత్సవాలు

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో ఉత్సవాలు ఈ నెల 22 నుంచి 28 వరకు జరగనున్నాయి.

Update: 2023-03-18 03:01 GMT

దిశ, బనగానపల్లె : నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో ఉత్సవాలు ఈ నెల 22 నుంచి 28 వరకు జరగనున్నాయి. అందుకు సంబంధించిన వివరాలను కార్యనిర్వహణాధికారి వీఎల్ఎన్ రామానుజన్ వెల్లడించారు. మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవాచన ,అంకురార్పణ ,పంచాంగ శ్రవణం, పన్నేరపు బండ్లు తిప్పుడం, ప్రాకార రథోత్సవం జరుగుతుందని అన్నారు. 23న శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి కల్యాణోత్సవం, అనంతరం గ్రామోత్సవం ఉంటుందని చెప్పారు.

రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. 24న కుంకుమార్చన, రాయబారం మహోత్సవం, పౌరాణిక నాటక ప్రదర్శనలు జరుగుతాయని తెలిపారు. 25న సహస్రనామ కుంకుమార్చన, పట్టు వస్త్రాల అలంకరణ ఉంటుందని వివరించారు. అదే రోజు రాత్రి ధర్మవరం అభయ హస్త సేవా సమితి సభ్యులు అన్నమయ్య సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తారని అన్నారు. 25న చౌడేశ్వరి దేవి మహోత్సవం, 26న రథోత్సవం . 28న వసంతోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని వివరించారు.

Tags:    

Similar News