యూట్యూబ్‌లో చూసి నాటుతుపాకులు.. అడ్డంగా బుక్కైన వాలంటీర్
దిశ, వెబ్ డెస్క్ : అడవిలో పక్షులను వేటాడటానికి ఇంట్లోనే ఓ వ్యక్తి నాటు తుపాకులు తయారు చేస్తున్నాడు.
దిశ, వెబ్ డెస్క్ : అడవిలో పక్షులను వేటాడటానికి ఇంట్లోనే ఓ వ్యక్తి నాటు తుపాకులు తయారు చేస్తున్నాడు. చివరకు చుట్టు పక్కవారికి డౌట్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాలో కార్వేటినగరం మండలం చింతోపు ఎస్టీ కాలనీలో నివాసముంటున్న రవి వాలంటీర్‌గా పని చేస్తున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం నుంచి రవి తన ఇంట్లో తుపాకులను తయారుచేస్తున్నాడు. ఒక రోజు రవి మరో ఇద్దరి స్నేహితులతో కలిసి ఇంటిలోనే దర్జాగా తుపాకులు తయారు చేస్తుండగా.. పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వెంటనే కేసు నమోదు చేసి విచారించగా.. జంతువులను వేటాడటానికి కొద్ది రోజుల కిందట ఓ పాత నాటు తుపాకీని కొనుగోలు చేశానని, అది పాతది కావడంతో సరిగ్గా పనిచేయడం లేదని తెలిపాడు. అందుకే యూట్యూబ్‌లో వీడియో చూసి ఇంట్లోనే తయారు చేస్తున్నట్టు రవి పోలీసులకు తెలిపారు. ఈ దాడిలో రెండు నాటు తుపాకులు, తయారీకి ఉపయోగించిన టూల్ కిట్లను సీజ్ చేసి నిందితుడిని రిమాండ్‌కు పంపారు.