Chandragiri: బీసీ హాస్టల్‌ విద్యార్థులపై బయట వ్యక్తుల దాడి.. ఒకరికి గాయాలు

ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్‌లో జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ...

Update: 2023-03-15 15:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్‌లో జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవల్లో సీనియర్ విద్యార్థి రాఘవేంద్ర తలకు గాయాలయ్యాయి. అయితే బయట వ్యక్తులు వచ్చి తమపై దాడి చేశారని సీనియర్ విద్యార్థులు చెప్పారు. తమపై హాకీ స్టిక్స్, ఇనుపరాడ్డులతో దాడి చేశారని ఆరోపించారు.


ఈ గొడవను సెల్ ఫోన్‌లో చిత్రీకరిస్తున్న వంట మాస్టర్ సెల్ తీసుకుని వీడియోలు సైతం డిలీట్ చేశారని తెలిపారు. ఇంత గొడవ జరుగుతున్నా హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట వ్యక్తులు  దాడికి పాల్పడటంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. అసలే ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయిన నేపథ్యంలో బయటకు వెళ్లినప్పుడు ఏం చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News