వాలంటీర్ వ్యవస్థలో కీలక మార్పులు.. క్లారిటీ?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది.

Update: 2024-06-06 11:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. దీంతో రాష్ట్రంలో పలు మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన వాలంటీర్ల వ్యవస్థ మీద మార్పులు జరగనున్నాయని, భారీ కసరత్తులు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై వాలంటీర్ ఉన్నత వర్గాలు క్లారిటీ ఇచ్చాయి వాలంటీర్ వ్యవస్థలో కీలక మార్పులు చేయనున్నట్లు జరుగుతోన్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని వెల్లడించాయి. దీనిపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని, ఫేక్ వార్తలను నమ్మకండి అని తెలిపాయి. కాగా కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం వాలంటీర్ల నియామకంలో డిగ్రీ ఉత్తీర్ణను ప్రామాణికంగా తీసుకుని 1994 నుంచి 2003 వరకు వయోపరిమితిగా నిర్ణయించనున్నట్లు నెట్టింట జనాలు చర్చించుకుంటున్నారు.


Similar News