సీఈవో మీనా సంచలన ప్రకటన.. ఎవరూ మాచర్లకు రావొద్దని హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం దుమారం రేపుతోంది. ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడైన పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తుండగా.. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పిన్నెల్లి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు.

Update: 2024-05-23 09:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం దుమారం రేపుతోంది. ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడైన పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తుండగా.. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పిన్నెల్లి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై సీఈవో ముఖేశ్ కుమార్ మీన సంచలన ప్రకటన విడుదల చేశారు. పిన్నెల్లి వీడియో తాము విడుదల చేయలేదు అన్నారు. ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదు అని స్పష్టం చేశారు. ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటామని అన్నారు. దర్యాప్తు సమయంలో బయటకు వెళ్లి ఉండొచ్చు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాల్వాయిగేట్ పీవో, ఏపీవోలను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇప్పుడిప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వస్తోంది. ఈ సమయంలో టీడీపీ నేతలు మాచర్లకు వెళ్లడం మంచిది కాదు. మళ్లీ పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉంది. అంతేకాదు. బయటివాళ్లు కూడా ఎవరూ మాచర్లకు రావొద్దని సీఈవో ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News