Railway Projectsపై సాకులు చెబుతోన్న కేంద్రం

రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం సాకులు చెబుతోందని వైసీపీ ఎంపీలు గురుమూర్తి, శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఏపీ భవన్ గురజాడ హాలులో వైసీపీ ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, గురుమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు..

Update: 2023-02-06 15:20 GMT

- ఎంపీలు గురుమూర్తి, శ్రీకృష్ణదేవరాయలు

దిశ, ఏపీ బ్యూరో: రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం సాకులు చెబుతోందని వైసీపీ ఎంపీలు గురుమూర్తి, శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఏపీ భవన్ గురజాడ హాలులో వైసీపీ ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, గురుమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రరాష్ట్రానికి ఇస్తామని ప్రకటించిన హామీలను నెరవేర్చాలని పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో గట్టిగా ప్రశ్నిస్తామన్నారు.


రైల్వే పరంగా బడ్జెట్‌లో రాష్ట్రానికి ఈ సారి రూ. 8500 కోట్లు కేటాయించామని గణాంకాల్లో చెబుతున్నా, వాటిని ఏ విధంగా ఖర్చు చేయబోతోందీ రైల్వే శాఖ సవివరంగా చెప్పాలని కోరారు. రాష్ట్రం వైపు నుంచి భూసేకరణకు డబ్బులివ్వడం లేదని రైల్వే సాకులు చెబుతోందన్నారు. జాతీయ రహదారుల విషయంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జాతీయ రహదారిపైకి అరగంటలో చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారని సీపీ ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, గురుమూర్తి పేర్కొన్నారు. 

Similar News