ప్రధాని మోడీ రోడ్ షోలో డ్రోన్స్.. కఠిన చర్యలకు కేంద్రం ఆదేశం

ప్రధాని మోడీ ఇటీవల విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.....

Update: 2024-05-23 13:17 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ ఇటీవల విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరంలో జరిగిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. అయితే ఈ రోడ్ షోలో భద్రత వైఫల్యం బయటపడింది. ప్రధాని మోడీ రోడ్ షో జరుగుతుండగా ఆ ప్రాంతంలో డ్రోన్స్ చక్కర్లు కొట్టాయి. ప్రధాని మోడీ రోడ్ షో ప్రాంతాన్ని ఎస్పీజీ నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించింది. కానీ అలసత్వం వహించారు. ప్రధాని రోడ్ షో 45 నిమిషాలకు ముందు ఆ ప్రాంతంలో డ్రోన్స్ రావడంతో ఎస్పీజీ అప్రమత్తమైంది. ఓ డ్రోన్‌ను డిస్‌ఫ్యూజ్ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినా పోలీస్ శాఖ పట్టించుకోలేదు.డ్రోన్లను ఎగురవేశారు. దీంతో కేంద్రం, ఎస్పీజీ సీరియస్ అయింది. ఇది భద్రతా వైఫల్యంగా కేంద్ర హోంశాఖ తేల్చింది. ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు లేఖ రాసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Similar News