బస్సు హారన్‌కే వైసీపీ బేజారెత్తిపోతుంది..అందుకే దాడులు: సీపీఐ నేత రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయి.

Update: 2023-10-29 09:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయి. రోజురోజుకు శాంతి భద్రతలు గాడి తప్పాయనటానికి కావలి ఘటనే నిదర్శనం’అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో వైసీపీ శ్రేణుల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి అని ఆరోపించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి సమీపంలో మద్దూరుపాడు జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను వైసీపీ గుండాలు చితకబాదటం అత్యంత దుర్మార్గం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆరోపించారు. బస్సు హారన్ మోతకే వైసీపీ బేజారెత్తిపోతోందని ధ్వజమెత్తారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News