కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలకు బుద్దా వెంకన్న రియాక్షన్

టీడీపీ ఇన్‌చార్జులను గొట్టంగాళ్లన్న కేశినేని నాని వ్యాఖ్యలపై బుద్దా వెంకన్న మాట్లాడుతూ నాని ఏమన్నా సైలెంట్‌గా ఉంటున్నానని తెలిపారు.

Update: 2023-06-09 06:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేశినేని నాని చేసిన ఘాటు వ్యాఖ్యలకు బుద్దా వెంకన్న రియాక్షన్ ఇచ్చారు. టీడీపీ ఇన్‌చార్జులను గొట్టంగాళ్లన్న కేశినేని నాని వ్యాఖ్యలపై బుద్దా వెంకన్న మాట్లాడుతూ నాని ఏమన్నా సైలెంట్‌గా ఉంటున్నానని తెలిపారు. కేశినేని నాని తనను ఎన్నోసార్లు అవమానించారని చెప్పారు. ఎన్ని సార్లు అవమానించినా భరించానని..తాను సైలెంట్‌గానే ఉన్నానని చెప్పుకొచ్చారు. నానితో తనకు బేదాభిప్రాయాలున్నప్పటికీ పార్టీకి నష్టం వాటిల్లకూడదనే ఏమ్మాట్లాడినా మౌనంగా ఉంటున్నట్లు చెప్పారు. నాని వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని బుద్దా వెంకన్న అన్నారు. 

Tags:    

Similar News