వాళ్లిద్దరే చంద్రబాబు గురువులు.. మంత్రి Botsa Satyanarayana

దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రపదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు.

Update: 2022-09-05 14:11 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రపదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 176 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడంతో.. టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. టీచర్స్ డే సందర్భంగా ముఖ్యమంత్రి జగన్.. గురువులను సత్కరించి వారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం వారు చేసే సేవలను అభినందించారు. అయితే ఇంతటి రోజును కూడా టీడీపీ నేతలు రాజకీయ ధోరణితోనే చూస్తున్నారు.

ఉపన్యాసాలిస్తూ ఉపధ్యాయులను కించపరుస్తున్నారని బొత్స ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు మానవత్వం, మంచి లేదు. టీచర్స్ డే రోజు ఆయన ఇష్టపడే రోజు కాదని అన్నారు. విద్య నేర్పించిన ఉపధ్యాయులు ఆయనకి గురువులు కాదు. వెన్నుపోటుకు ఆజ్యం పోసిన రామోజీ, రాధకృష్ణలే ఆయనకి గురువులు అని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. నువ్వు సీఎం పదవిలో ఉన్నపుడు విద్యారంగానికి ఏం చేశావని ప్రశ్నించారు. కాగా సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక విద్యారంగం నుంచి ఫౌండేషన్ వరకు చాలా మార్పులు జరిగాయని.. వీటన్నింటినీ మేము గర్వంగా చెప్పుకుంటామన్నారు.

Tags:    

Similar News