వాహనదారులకు బిగ్ అలర్ట్.. నో పార్కింగ్ లో వాహనాలు నిలిపితే రూ. 1035 ఫైన్

విశాఖ పట్టణంలో పెరుగుతున్న జనాభాతో పాటు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ప్రజలు తమ వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలిపి ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తున్నారు.

Update: 2024-05-26 04:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ పట్టణంలో పెరుగుతున్న జనాభాతో పాటు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ప్రజలు తమ వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలిపి ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం విశాఖను రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి ప్రజల తాకిడి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు సీపీ అయ్యన్నార్ రంగంలోకి దిగారు. విశాఖలో వెహికల్ రాంగ్ పార్కింగ్ పై సీపీ అయ్యన్నార్ కన్నెర్ర చేశారు. ఎన్నిసార్లు చెప్పినా.. వాహనదారులు మారకపోవడంతో.. నగర వ్యాప్తంగా స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. అడ్డదిడ్డంగా పార్క్ చేసిన వాహనాలకు లాక్ వేసి.. రూ.1035 ఫైన్ చెల్లిస్తేనే వెహికల్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

Similar News