బెంగళూరు రేవ్ పార్టీ ..టీడీపీ, వైసీపీ నేతల మధ్య వార్

ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో బెంగుళూరు రెవ్ పార్టీ సంచలనం సృష్టిస్తుంది. ఈ రేవ్ పార్టీలో తీగలాగితే డొంకంతా కదులుతోంది.

Update: 2024-05-24 11:24 GMT

దిశ,వెబ్‌డెస్క్: ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో బెంగుళూరు రెవ్ పార్టీ సంచలనం సృష్టిస్తుంది. ఈ రేవ్ పార్టీలో తీగలాగితే డొంకంతా కదులుతోంది. తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఈ రేవ్ పార్టీలో లోతుగా దర్యాప్తు చేస్తున్న కొద్ది సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇదిలా ఉంటే బెంగళూరు రేవ్ పార్టీ ప్రజెంట్ వైసీపీ V/S టీడీపీ అన్నట్టుగా ఏపీ రాజకీయాల్లో రచ్చ చేస్తుంది. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై సూత్రధారులు మీరే అని ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఒక కారుపై ఉండడంతో ఇందులో వైసీపీ నాయకులు ఉన్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది.

సోషల్ మీడియాలో వైసీపీ, టీడీపీ ఆరోపణలు దీనిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆ స్టిక్కర్ ఎవరు ఎందుకు వినియోగించారో తనకు తెలియదని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చానని చెప్పినప్పటికీ ఈ వ్యవహారంలో వైసీపీ నేతల మీద ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ సప్లై సూత్రధారులంతా టీడీపీ నేత లోకేష్ అనుచరులేనని వైసీపీ ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. దీనికి కౌంటర్ ఇస్తూ..రేవ్ పార్టీ డ్రగ్స్ సూత్రధారులు సైకో జగన్ అనుచరులు, వైసీపీ నేతలేనని టీడీపీ శ్రేణులు ట్వీట్ చేశాయి.


Similar News