Atma Sakshi Survey: ఏపీలో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీ-జనసేనదే అధికారం.. ఆ పార్టీ తోడైతే మరింత గ్రిప్...!

ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏ పార్టీ గెలుస్తోందోనన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది...

Update: 2023-10-03 11:51 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏ పార్టీ గెలుస్తోందోనన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. రాష్ట్రంలో ప్రధానంగా వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతం టీడీపీ-జనసేన పొత్తుతో వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు వైసీపీ మాత్రం సింగిల్ గా ఎన్నికలకు వెళ్తున్నట్లు స్పష్టం చేసింది. బీజేపీ మాత్రం జనసేనతో పొత్తులో ఉన్నట్లు ప్రకటించింది. ఇక కమ్యూనిస్టులు బీజేపీని కలుపుకోకపోతే టీడీపీ, జనసేనతో కలిస్తున్నామని ఆ పార్టీ వెల్లడించింది. ఈ నేపథ్యలో ఆత్మసాక్షి సంస్థ 175 స్థానాలకు సంబంధించి సర్వే రిపోర్టును విడుదల చేసింది. జులై, సెప్టెంబర్ నెలలో పీపుల్స్ పల్స్‌ను రాబట్టింది. ఈ మేరకు తన సర్వేలో సంచలన విషయం వెల్లడైంది. సెప్టెంబర్ 30న తన సర్వే రిపోర్టును విడుదల చేసింది. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణాలపైనా సర్వే చేపట్టింది. ఈ సర్వేలో టీడీపీ+జనసేన పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. టీడీపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే 86 సీట్లు, వైసీపీ 68, జనసేన 6, తీవ్ర పోటీ 15 స్థానాల్లో ఉంటుందని తేలింది. ఇక టీడీపీ+జనసే పొత్తులో 95, వైసీపీ 60, జనసేన13, తీవ్రమైన పోటీ 7 స్థానాల్లో ఉన్నట్లు సర్వే తేల్చింది. ఇక బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే 72-75 స్థానాల్లో గెలుస్తారని... వైసీపీకి 98-100 సీట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడైంది. అయితే టీడీపీ, జనసేన, కమ్యూనిస్టులు పొత్తులో ఎన్నికలకు వెళ్తే 115 నుంచి 122 వరకు , వైసీపీకి 56 నుంచి 58 సీట్లు, గట్టి పోటీ 4 స్థానాల్లో ఉంటుందని ఆత్మసాక్షి సర్వేలో వెల్లడైనట్లు రిపోర్టును ఆ సంస్థ విడుదల చేసింది. ఇక ఎంపీ స్థానాలకు సంబంధించి టీడీపీ-జనసేన పొత్తులో 17, వైసీపీ 7, ఒక స్థానంలో తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉందని ఆత్మసాక్షి సర్వే రిపోర్టు తేల్చింది. అయితే కాంగ్రెస్‌కి పార్టీకి సంబంధించి ఎలాంటి గణాంకాలను పేర్కొనలేదు. 

ఇక చంద్రబాబు అరెస్ట్ సరికాదంటూ 56 శాతం, కరెక్ట్ అంటూ 29 శాతం, రాజకీయ కక్ష అంటూ 18 శాతం, నో ఐడియా అంటూ 4 శాతం ప్రజలు చెప్పినట్లు ఈ సర్వేలో తేలింది. ఇక చంద్రబాబు అరెస్ట్ అధికార వైసీపీపై ఎంతా ప్రభావం చూపుతుందనే అంశంపైనా ఆత్మసాక్షి సర్వే చేసింది. వైసీపీపై 51 శాతం ప్రభావం చూపుతుందని.. 35 శాతం ప్రభావం ఉండదని.. 10 శాతం పాక్షిక్షం ప్రభావం చూపుతుందని, నో ఐడియా 4 శాతం ప్రజలు తమ అభిప్రాయం తెలిపారు. బీజేపీ జోక్యంతోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి కావాలనే చంద్రబాబును అరెస్ట్ చేయించారనే అంశంపై 52 శాతం ప్రజలు Yes అనే మాటనే చెప్పుకొచ్చారు. 16 శాతం ప్రజలు No అనే అభిప్రాయాన్ని వెల్లడించారు. బీజేపీ లేకుండానే సీఎం జగన్ చంద్రబాబు అరెస్ట్ చేయించారనే అంశంపై 28 శాతం ప్రజలు అవునే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇక ముఖ్యంలో అధికారంలోకి ఎవరొస్తారే విషయంపై చేసిన సర్వేలో టీడీపీ+జనసేన పొత్తుతో అధికారాన్ని కైవసం చేసుకుంటారనే అభిప్రాయమే ఎక్కువగా వెల్లడించింది. టీడీపీ- జనసేనపై అధికారంపై 50 శాతం ప్రజలు మద్దతు తెలిపారు. రెండు పార్టీలు పొత్తు పెట్టుకోకుంటే అధికారంలోకి రాలేరనే అంశంపై 43 శాతం ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పారు. అయితే బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కలిసే అవకాశం ఉందని ఈ సర్వే రిపోర్టు తేల్చింది. టీడీపీ-జనసేన- బీజేపీకి 42 శాతం ప్రజలు మద్దతు తెలపగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 53 శాతం ప్రజలు అనుకూలంగా చెప్పారు. ఇక టీడీపీ+జనసేన+కమ్యూనిస్టుల పొత్తుతో అనుకూలంగా 54 శాతం మంది, వ్యతిరేకంగా 40 శాతం ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలిపారు. 

ఇవి కూడా చదవండి : 

టీడీపీ రెండు మూడు ముక్కలవ్వొచ్చు : Vijaysai Reddy

Click here for Andhra Pradesh SURVEY AS ON 30.09.2023 

Tags:    

Similar News