APSRTC Good News: డోర్ టు డోర్ సేవలు ప్రారంభం

ఏపీఎస్ఆర్టీసీ సేవలు ప్రజలకు మరింత చేరువకానున్నాయి...

Update: 2023-03-20 12:59 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీఎస్ఆర్టీసీ సేవలు ప్రజలకు మరింత చేరువకానున్నాయి. లగేజీ, సామాగ్రి, వస్తువులు, సరుకులు, పార్శిల్స్, కొరియర్ కవర్లు, వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, ఎరువులు, పుస్తకాలు, మందులు తరలింపు వంటివి ఇప్పటివరకూ కార్గో ద్వారా బస్టాండ్ల వరకే పరిమితమైంది అయితే ఈ సేవలను మరింత విస్తరించాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్గో సర్వీసుకు ఆదరణ పెరగడంతో ఇప్పుడు డైరెక్ట్‌గా ఇంటికే తీసుకెళ్లి అప్పగించాలని ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. డోర్ టు డోర్ కార్గో పేరుతో సేవలు అందించనున్నారు.


మంగళవారం రాత్రి నుంచి సేవలు

ఈ మేరకు మంగళవారం రాత్రి నుంచి డోర్ టు డోర్ కార్గో సేవలు ప్రారంభించనున్నారు. తొలి మూడు ఆర్డర్లకు కార్గో పికప్, డెలివరీ సేవలు ఫ్రీగా అందించనున్నారు. తొలుత విజయవాడ, విశాఖ మధ్య ఉగాది నుంచి సేవలు ప్రారంభించనున్నారు. దశలవారీగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకు విస్తరించనున్నారు. ఆన్ లైన్ లేదా యాప్ ద్వారా కార్గే సేవలు వినియోగించుకోవచ్చని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.


అయితే సరుకు రవాణలో కొన్ని వస్తువులను నిషేధించిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News