CM రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి బొత్స కౌంటర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-03-11 13:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై రేవంత్ రెడ్డి మాట్లాడటం వల్ల ఉపయోగం లేదని కొట్టిపారేశారు. ఆ అంశంపై మాట్లాడాల్సింది.. వివరణ ఇవ్వాల్సింది కేవలం బీజేపీ నేతలు అని నొక్కి చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పినవన్నీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేశారని గుర్తుచేశారు. సంక్షేమ పథకాలే తమను మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ఏపీ ప్రజలు లేరని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిందేమీ లేక ఆ గుమ్మం, ఈ గుమ్మం తిరుగుతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందని అన్నారు. డీఎస్సీ పరీక్ష తేదీలను రేపు అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.

Read More..

చంద్రబాబు ఇంటివద్ద కేఏ పాల్ హల్‌చల్  

Tags:    

Similar News