సీబీఐ ఛార్జీషీట్ లో అన్ని కల్పిత కథలే.. ఏపీ ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddy

వైఎస్ వివేకా హత్యా కేసులో సీబీఐ అన్ని కల్పిత కథలే అల్లిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

Update: 2023-07-25 11:05 GMT

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ వివేకా హత్యా కేసులో సీబీఐ అన్ని కల్పిత కథలే అల్లిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సీబీఐ ఛార్జీషీట్ లో కొన్ని పాయింట్లే తీసుకొని విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. వివేకా కేసు సీబీఐ చరిత్రలోనే ఓ పెద్ద మచ్చ అని అన్నారు. విచారణలో బేసిక్ లాజిక్ ను సీబీఐ మర్చిపోయిందని చెప్పారు. వివేకా కేసులో రెండు సిట్ లు చెప్పిన విషయాలను సీబీఐ పరిగణలోకి తీసుకోలేదన్న సజ్జల.. కనీసం కాల్ రికార్డింగులను కూడా పట్టించుకోలేదని అన్నారు.

ముందే దోషులను నిర్ణయించుకొని కల్పిత కథలు అల్లినట్లుగా ఉందని చెప్పారు. జగన్ ను డీమోరలైజ్ చేయడానికే వివేకాను హత్య చేశారని ఆరోపించారు. పొలిటికల్ గా సూసైడ్ చేసుకోవాలని ఎంపీ అవినాష్ రెడ్డి ఎందుకు అనుకుంటారని చెప్పారు. కావాలనే ఆంధ్రజ్యోతి, ఈనాడు వంటి వార్తా సంస్థలు సీబీఐని తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News