కొనసాగుతున్న వలసల పర్వం.. టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మరో ఎంపీ

ఏపీలో ఎన్నికలకు కొద్ది రోజులే ఉన్న సమయంలో.. టికెట్ దక్కక అసంతృప్తితో ఉన్న అధికార వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా టీడీపీలో చేరుతున్నారు

Update: 2024-03-02 14:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఎన్నికలకు కొద్ది రోజులే ఉన్న సమయంలో.. టికెట్ దక్కక అసంతృప్తితో ఉన్న అధికార వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా టీడీపీలో చేరుతున్నారు. ఈ నేపధ్యంలోనే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీకి షాక్ ఇచ్చి టీడీపీలో చేరారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో టీడీపీ రా.. కదలిరా బహిరంగ సభ నిర్వంహించింది.

ఈ సభలో చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎంపీ లావుతో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు సహా పలువురు నాయకులు టీడీపీ కండువా కప్పుకున్నారు. కాగా నరసరావుపేట వైసీపీ ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయలుకు వైసీపీ అధిష్టానం మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేసేందుకు నిరాకరించింది. దీనిపై అసంతృప్తితో ఉన్న ఆయన ఇవ్వాళ టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరుపున లావుకు సీటు ప్రకటించే అవకాశం ఉంది.

Read More..

చర్చగా మారిన వసంత మాటలు.. ఆయన వ్యూహం ఏంటీ?

Tags:    

Similar News