ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే: వైసీపీ ఎంపీ నందిగాం సురేష్

Update: 2022-02-09 13:16 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మార్గాని భరత్‌తో కలిసి నందిగాం సురేష్‌ మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయాలని కోరారు. విభజనపై అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు తప్పును ఇతరులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ప్రత్యేక హోదా ఇస్తామని విభజన చట్టంలో ఉందని అయితే దానని అటకెక్కించింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో నోటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన చంద్రబాబు రాత్రికి రాత్రి అమరావతికి పారిపోయారంటూ.. విరుచుకుపడ్డారు.

హైదరాబాద్‌ పదేళ్లు ఉమ్మడి రాజధాని కాకుండా చంద్రబాబు, లోకేశ్‌లు అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు నీరుగార్చారని స్పష్టం చేశారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్రం వద్ద దిగజారిపోయి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని ఎంపీ ఆరోపించారు. ప్రత్యేక హోదా అన్నది ఎప్పటికైనా ఇచ్చి తీరాల్సిందేనని ఎంపీ నందిగాం సురేష్ డిమాండ్ చేశారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News