ప్రభుత్వ వైఫల్యంతోనే అభివృద్ధిలో ఆంధ్రా ఆమడదూరం : బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్

వైసీపీ ప్రభుత్వ వైఫల్యంతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆమడదూరం నిలిచిందని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు.

Update: 2024-01-13 10:32 GMT

దిశ, వెబ్‌డెస్క్ : వైసీపీ ప్రభుత్వ వైఫల్యంతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆమడదూరం నిలిచిందని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. ఇవాళ ఆయన విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ బాధ్యతారాహిత్యంతో దాదాపు 30 ప్రాజెక్టుల వ్యయం.. రూ.58 వేల కోట్ల మేర అదనపు భారం కేంద్రంపై పడిందని ఆరోపించారు. రైల్వే జోన్ ఆఫీస్ నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలం రైల్వే శాఖకు బదిలీ చేయడంలో వైసీపీ సర్కార్ ఆలస్యం చేయడం సమజసం కాదన్నారు. జోనల్ ప్రధాన కార్యాలయానికి అవసరమైన కొత్త భవనాల నిర్మాణం, శాశ్వత భవనాల నిర్మాణం కోసం 52.20 ఎకరాల రెవెన్యూ భూమి అవసరమని కేంద్రం ప్రతిపాదనలు పంపింది. అయితే, ఆ భూమిని బదిలీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వల్ల పనులు ఆగిపోయాయని దినకర్ ఆరోపించారు. చెప్పారు. అందులో 5,581 కి.మీ, రూ.70 వేల కోట్ల విలువైన 16 కొత్త లైన్లు మరియు 15 డబ్లింగ్ లైన్ల పనులు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా కేంద్రం ఆవాస్ యోజన కింద ఇచ్చిన 25 లక్షల ఇళ్లను జగనన్న కాలనీలుగా పేరు మార్చి ప్రజలకు ఇస్తున్నారని లంకా దినకర్ ధ్వజమెత్తారు. 

Tags:    

Similar News