అల్లు అర్జున్ నంద్యాల పర్యటన ఎఫెక్ట్..వివాదంలో ఇద్దరు ఔట్

ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ప్రచారం జోరు మామూలుగా లేదు.

Update: 2024-05-25 05:09 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ప్రచారం జోరు మామూలుగా లేదు. గెలుపు లక్ష్యంగా పార్టీ నేతలు విశ్వప్రయత్నలు చేశారు. ఈ ఎన్నికల్లో సినీ నటులు సైతం ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించి హడావుడి చేసిన విషయం తెలిసిందే.! నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన తరఫున ప్రచారం నిర్వహించారు. తన మిత్రుడిని గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను బన్నీ కోరారు.

ఈ క్రమంలోనే భారీ జనసమీకరణతో వివాదం తలెత్తింది. దీంతో అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ ఘటనపై మరో న్యూస్ వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ వివాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్‌కు పంపారని సమాచారం. ఎస్‌బికి చెందిన స్వామి నాయక్, నాగరాజులను వీఆర్‌కు పంపుతున్నట్లు శనివారం ఉదయం పోలీసులు ప్రకటనలో తెలిపారు. భారీ జనసమీకరణ జరుగుతుందన్న సమాచారం ఇవ్వకపోవడంతో ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు.

Similar News