ఎన్నికల శిక్షణకు డుమ్మా.. ఐదుగురు సస్పెండ్, 272 మందికి షోకాజ్ నోటీసులు

ఏపీలో జరిగిన ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి డుమ్మా కొట్టిన అధికారులపై చర్యలు తీసుకున్నారు..

Update: 2024-05-25 07:19 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. జూన్ 4న ఫలితాలు విడుదలకానున్నాయి. ఫలితాల సమయం దగ్గర పడుతుండటంతో కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐదుగురు ఎన్నికల అధికారులను సస్పెండ్ చేయడం కలకలం రేగింది. ఎన్నికల పోలింగ్‌కు రాష్ట్రంలోని పీవో, ఏపీవోలను శిక్షణ ఇచ్చారు. పోలింగ్ విధులకు సంబంధించి పలు సూచనలు చేశారు. అయితే రెండోదఫా శిక్షణలో దాదాపు 272 మంది డుమ్మా కొట్టారు. దీంతో తిరుపతి జిల్లా కలెక్టర్ తాజాగా చర్యలు తీసుకున్నారు. ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశారు. 272 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

Similar News