లంచం డిమాండ్.. ఏసీబీ వలలో రావులపాలెం సీఐ ఆంజనేయులు

రాష్ట్రంలో లంచగొండి అధికారులు భరతం పడుతోంది ఏసీబీ..

Update: 2024-05-25 08:35 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో లంచగొండి అధికారులు భరతం పడుతోంది ఏసీబీ. లంచం అనే మాట వినబడితే వెంటనే దూసుకెళ్తోంది. తనిఖీలు నిర్వహించి అవినీతిపుట్టను పగలగొడుతోంది. ప్రతి రోజూ ఏదో ఒక చోట సోదాలు నిర్వహించి అధికారులకు చుక్కలు చూపిస్తోంది. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ లంచాలకు అలవాటు పడిన అధికారుల పట్ల దూకుడుగా వ్యవహరిస్తోంది.

తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. రావులపాలెం పోలీస్ స్టేషన్‌పై దాడులు నిర్వహించారు. ఓ కేసు విషయంలో సీఐ ఆంజనేయులు రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించారు. పక్కా పథకం ప్రకారం లంచం తీసుకుంటున్న సీఐ ఆంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. విచారించి శాఖపరమైన చర్యలకు ఆదేశించారు.

Similar News