ఏపీకి బిగ్ అలర్ట్.. రేపు ఈ జిల్లాలో వర్షాలు..!

బంగాళాఖాతంలో ఏర్పడిన బలపడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది....

Update: 2024-05-24 13:50 GMT

దిశ, వెబ్ డెస్క్:బంగాళాఖాతంలో ఏర్పడిన బలపడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. శనివారం ఉదయానికి తుఫానుగా మారనుంది. అదే రోజు రాత్రికి తీవ్ర తుఫానుగా మారనుందని, ఆదివారం అర్ధరాత్రికి బంగ్లాదేశ్, బంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, విజయనగరం, మన్యం జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది. విశాఖ, కోనసీమ, గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం, ఆదివారం వైఎస్సార్ కడప, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, రైతులు, కూలీలు, చెట్ల కింద, ఖాళీ ప్రదేశాల్లో ఉండొద్దని హెచ్చరించింది. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. అన్ని పోర్టులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. అయితే తుఫాను ఎఫెక్ట్ రాష్ట్రంపై అంతగా ఉండొదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 

Similar News