చంద్రబాబు హెలికాప్టర్ ఇష్యూ.. DGCA సీరియస్.. విచారణ వేగంతం

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరకు పర్యటన నేపథ్యంలో సంచలన ఘటన జరిగింది..

Update: 2024-01-20 13:43 GMT

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరకు పర్యటనలో సంచలన ఘటన జరిగింది. అరకు వెళ్లాల్సిన హెల్లికాప్టర్ ఒక్కసారిగా విజయవాడ రూటు వైపు మళ్లింది. దీంతో పైలట్‌ను ఏటీసీ అప్రమత్తం చేసింది. వెంటనే హెలికాప్టర్‌ను పైలట్ అరకు వైపు తీసుకెళ్లారు.

అయితే ఈ ఘటనను డీజీసీఏ సీరియస్ తీసుకుంది. విచారణను వేగవంతం చేసింది. హెలికాప్టర్ విజయవాడ మళ్లడంపై ఆరా తీసింది. హెలికాప్టర్ డెస్టినేషన్‌లో జరిగిన పొరపాటుగా గుర్తించింది. డెస్టినేషన్‌లో మూడు రూటు మ్యాప్‌లను నమోదు చేసినట్లు తెలిసింది. రెండు అరకు వైపు ఉండగా.. మరొకటి విజయవాడ వైపు ఉన్నట్లు గుర్తించారు. దీని వల్లనే చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పైలట్‌ విజయవాడ వైపు కొంత దూరం తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. దీని వల్లనే గందరగోళం ఏర్పడిందని, ఏటీసీ అలర్ట్ చేయడంతో హెలికాప్టర్‌ను మళ్లీ అరకు వైపు తిప్పారు. దీంతో ఈ ఘటనపై పైలట్‌ను ఏవీయేషన్ అధికారులు వివరణ అడిగారు. హెలికాప్టర్ ఎందుకు దారి మళ్లిందని ప్రశ్నించారు.

కాగా ఇది చిన్న ఘటన కాదని పలువురు అంటున్నారు. జెడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న వ్యక్తికి ఇలా జరగడం పెద్ద విషయమని చెబుతున్నారు. ఏది ఏమైనా మరోసారి ఇలాంటి జరగకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

Read More..

Breaking: నమ్మించి గొంతుకోసిన వ్యక్తి జగన్‌..చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు  

Tags:    

Similar News