High Court: కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్.. విచారణ మళ్లీ వాయిదా

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మద్యం కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది...

Update: 2023-11-17 13:35 GMT

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మద్యం కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే పిటిషన్‌పై విచారణను ఈ నెల 20కు వాయిదా వేసింది. టీడీపీ హయాంలో కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మినిస్టర్‌గా పని చేశారు. ఈ సమయంలో మద్యం కంపెనీలకు కొల్లు రవీంద్ర అనుచిత లబ్ధి చేకూర్చాని ఏపీ సీఐడీ ఆయనపై కేసు నమోదు చేసింది. దీంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కొల్లు రవీంద్ర హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం దురద్దేశంతోనే సీఐడీ ద్వారా తనపై తప్పుడు కేసులు పెట్టిస్తోందని కొల్లు రవీంద్ర పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ జరిగింది. శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అయితే కొల్లు రవీంద్రకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్నారు. తమ ప్రభుత్వ హయాంలో మద్యం వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగలేదని అటు కొల్లు రవీంద్ర అంటున్నారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని కొల్లు రవీంద్ర అంటున్నారు. మరి సోమవారం ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News