పోలవరం పరిహారం అందక రైతు ఆత్మహత్యాయత్నం

పశ్చిమగోదావరి జిల్లా ధవళేశ్వరంలో రైతు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది...

Update: 2024-05-24 13:16 GMT

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా ధవళేశ్వరంలో రైతు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. రైతు సీతారామయ్య పోలవరం ప్రాజెక్టు కార్యాలయం వద్ద పురుగులు మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. దీంతో ఆయన్ను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సీతారామయ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా దేవీపట్నానికి చెందిన సీతారామయ్య పోలవరం పునరావాస బాధితుడు. పరిహారం, ఆర్ అండ్ ఆర్ కోసం చాలా రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరిగారు. చాలా మంది అధికారులను కలిసి పరిహారం చెల్లించాలని కోరారు. కానీ ఎవరూ స్పందించలేదు. ఇక పరిహారం దక్కదేమోనని మనస్థాపం చెందారు. పరుగుల మందు డబ్బా తీసుకుని పోలవరం ప్రాజెక్టు కార్యాలయం వద్దకు వెళ్లారు. అక్కడ అందరూ చూస్తుండగా పురుగుల మందు తాగారు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. సీతారామయ్యను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Read More..

టోల్ గేట్ వద్ద 160 కిలోల గంజాయి స్వాధీనం..ఇద్దరు అరెస్ట్

Tags:    

Similar News