తమ్మారెడ్డి భరద్వాజ తల్లి మృతి

ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కృష్ణవేణి(94) మృతిచెందారు. గ‌త కొంత‌కాలంగా ఆమె అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. భ‌రద్వాజ తండ్రి కృష్ణ‌మూర్తి సైతం చిత్ర నిర్మాగా ర‌వీంద్ర ఆర్ట్స్ ప‌తాకంపై ల‌క్షాధికారి, జ‌మీందారు, బంగారు గాజులు, ధ‌ర్మ‌ధాత‌, ద‌త్త పుత్రుడు, డాక్ట‌ర్ బాబు త‌దిత‌ర అనేక విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించారు. ఈ దంపతుల‌కు ఇద్ద‌రు కుమారులు. చిన్న కుమారుడు భ‌రద్వాజ నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా అనేక విజ‌య‌వంతమైన చిత్రాలు అందించారు. పెద్ద కుమారుడు లెనిన్ బాబు కూడా […]

Update: 2020-04-06 19:37 GMT

ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కృష్ణవేణి(94) మృతిచెందారు. గ‌త కొంత‌కాలంగా ఆమె అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. భ‌రద్వాజ తండ్రి కృష్ణ‌మూర్తి సైతం చిత్ర నిర్మాగా ర‌వీంద్ర ఆర్ట్స్ ప‌తాకంపై ల‌క్షాధికారి, జ‌మీందారు, బంగారు గాజులు, ధ‌ర్మ‌ధాత‌, ద‌త్త పుత్రుడు, డాక్ట‌ర్ బాబు త‌దిత‌ర అనేక విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించారు. ఈ దంపతుల‌కు ఇద్ద‌రు కుమారులు. చిన్న కుమారుడు భ‌రద్వాజ నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా అనేక విజ‌య‌వంతమైన చిత్రాలు అందించారు. పెద్ద కుమారుడు లెనిన్ బాబు కూడా చ‌నిపోయారు. మొద‌టి నుంచి వీరిది వామ‌ప‌క్ష భావాలున్న కుటుంబం. అనారోగ్యంతో త‌న త‌ల్లి రెండు నెల‌లుగా ఇబ్బంది ప‌డుతున్నార‌ని తెలిపారు. త‌న మిత్రులు, శ్రేయోభిలాషులు చాలా మంది ఫోన్లు చేస్తున్నార‌ని, క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్నందున త‌న‌ను ప‌రామ‌ర్శించ‌డానికి ఎవ‌రూ ఇంటికి రావ‌ద్ద‌ని తమ్మారెడ్డి భరద్వాజ కోరారు.

Tags: Tammareddy Bharadwaja, mother dies, movie producer, krishnamurthy, coronavirus

Tags:    

Similar News