బిగ్ బి ఫస్ట్ ఫోటో షూట్ పిక్… సిగ్గుపడ్డాడట!

బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాక్ డౌన్ సమయంలో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎలా ఉండేవాడో తెలుపుతూ… ఆనాటి గోల్డెన్ మెమోరీస్ ను అభిమానులతో పంచుకున్నాడు. T 3501 – My very first photo shoot for a film mag., – ‘Star & Style’ .. prodded & goaded to a very shy reticent and reluctant me , by famed most […]

Update: 2020-04-15 05:11 GMT

బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాక్ డౌన్ సమయంలో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎలా ఉండేవాడో తెలుపుతూ… ఆనాటి గోల్డెన్ మెమోరీస్ ను అభిమానులతో పంచుకున్నాడు.

1969 లో “సాత్ హిందుస్థాని” సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన బిగ్ బీ… తన తొలి ఫిల్మ్ మ్యాగ్జిన్ ఫోటో షూట్ కు సంబంధించిన పిక్చర్ షేర్ చేశారు. అప్పుడు బాలీవుడ్ కు కొత్త వ్యక్తిని అని… స్టైల్, స్టార్ రెండు లేవని అన్నాడు. ఆ సమయంలో స్టార్ అండ్ స్టైల్ మ్యాగ్జిన్ కు సంబంధించిన ఫోటో షూట్ లో పాల్గొనేందుకు సిగ్గుపడ్డాను అని తెలిపాడు సీనియర్ బచ్చన్. అప్పటి ప్రఖ్యాత సినీ జర్నలిస్ట్ దేవయాని చౌబల్ తనను అసలు ఇష్టపడక పోయేవారని గుర్తు చేసుకున్నాడు.

ఇక “నసీబ్” సినిమా కోసం “రంగ్ జామాకె” పాట షూటింగ్ చేస్తున్న సమయంలో రిషి కపూర్ తో కలిసి ఉన్న ఫోటోను కూడా అభిమానులకు సోషల్ మీడియా వేదికగా చూపించారు. జీనియస్ డైరెక్టర్ మన్మోహన్ దేశాయ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రిషి కపూర్ చాప్లిన్ గా కనిపించారట. చాలా మంచి రోజులు ఉండేవని… చాలా ఎంజాయ్ చేశామని తెలిపాడు బచ్చన్.

Tags:Big B, Amitabh Bachchan, Earlier Days, Bollywood

Tags:    

Similar News