Amitabh Bachchan తప్పుకుంటేనే మంచిది.. లేదంటే ?

దిశ, సినిమా : బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాన్ మసాలా అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్‌‌కు సపోర్ట్ చేయకూడదని కోరింది ఓ నేషనల్ యాంటి టొబాకో ఆర్గనైజేషన్. పాపులర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇలాంటి యాడ్స్ చేయడం వల్ల యూత్ పొగాకు తీసుకోవడంలో తప్పులేదని భావిస్తారని, బ్యాడ్ హ్యాబిట్స్‌కు అట్రాక్ట్ అవుతారని తెలిపింది. నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ టొబాకో ప్రెసిడెంట్ శేఖర్ సల్కార్ ఈ విషయం మీద బిగ్ బికి లేఖ రాశారు. పొగాకు, పాన్ […]

Update: 2021-09-24 05:28 GMT

దిశ, సినిమా : బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాన్ మసాలా అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్‌‌కు సపోర్ట్ చేయకూడదని కోరింది ఓ నేషనల్ యాంటి టొబాకో ఆర్గనైజేషన్. పాపులర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇలాంటి యాడ్స్ చేయడం వల్ల యూత్ పొగాకు తీసుకోవడంలో తప్పులేదని భావిస్తారని, బ్యాడ్ హ్యాబిట్స్‌కు అట్రాక్ట్ అవుతారని తెలిపింది. నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ టొబాకో ప్రెసిడెంట్ శేఖర్ సల్కార్ ఈ విషయం మీద బిగ్ బికి లేఖ రాశారు. పొగాకు, పాన్ మసాలాకు అలవాటు పడితే ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్య పరిశోధనలో రుజువైందని తెలిపారు. అలాంటప్పుడు హై-ప్రొఫైల్ పల్స్ పోలియో ప్రచారానికి ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న అమితాబ్ బచ్చన్.. పాన్ మసాలా ప్రకటనల నుండి వీలైనంత త్వరగా ఉపసంహరించుకోవాలని కోరారు.

Tags:    

Similar News