ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన అమెజాన్..!
దిశ, వెబ్ డెస్క్: కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలన్ని ఉద్యోగుల్లో కోతలు విధిస్తుంటే, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా సంక్షోభంలోనూ పనిచేస్తున్న ఉద్యోగులందరికీ బోనస్ ప్రకటించింది. ఇందుకోసం 500 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.3,775 కోట్లు ఒకేసారి చెల్లిస్తామని వెల్లడించింది. కరోనా కష్టకాలంలోనూ అమెజాన్ సేవలందించిందని సంస్థ తెలిపింది. ఇందులో ఫ్రంట్ లైన్ ఉద్యోగుల పాత్ర ముఖ్యమని స్పష్టం చేసింది అమెజాన్. జూన్ వరకు పనిచేసిన […]
దిశ, వెబ్ డెస్క్: కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలన్ని ఉద్యోగుల్లో కోతలు విధిస్తుంటే, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా సంక్షోభంలోనూ పనిచేస్తున్న ఉద్యోగులందరికీ బోనస్ ప్రకటించింది. ఇందుకోసం 500 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.3,775 కోట్లు ఒకేసారి చెల్లిస్తామని వెల్లడించింది.
కరోనా కష్టకాలంలోనూ అమెజాన్ సేవలందించిందని సంస్థ తెలిపింది. ఇందులో ఫ్రంట్ లైన్ ఉద్యోగుల పాత్ర ముఖ్యమని స్పష్టం చేసింది అమెజాన్. జూన్ వరకు పనిచేసిన ఉద్యోగులు, భాగస్వాములు ఒక్కొక్కరు 150 డాలర్లు అంటే రూ11,300 నుంచి 3000 డాలర్లు అంటే రూ.2.26 లక్షల వరకు బోనస్‌గా చెల్లిస్తామని అమెజాన్ తెలిపింది. కాగా కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయంలో వినియోగదారులు ఈ కామెర్స్ వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ కామర్స్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 బిలియన్ వస్తువులను వినియోగదారులకు చేరవేస్తున్నామని అమెజాన్ తెలిపింది.