మంగళగిరిలో రెడ్ అలెర్ట్.. కదలడానికి వీల్లేదు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాతంలోని మంగళగిరికి మరోసారి కరోనా భయం సోకింది. మూడు వారాల క్రితం అమెరికా నుంచి మంగళగిరి వచ్చిన దంపతులకు కరోనా సోకిందన్న వార్తతో కలకలం రేగింది. ఏనోట విన్నా వారి గురించిన పుకార్లే షికార్లు చేశాయి. వైద్యపరీక్షల్లో జెట్ లాగ్, ప్రాంత మార్పు వల్ల వారిలో జ్వరం వంటి లక్షణాలు కనిపించాయని, కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అప్పుడు రేగిన కలకలం సద్దుమణిగింది. తాజాగా, ఢిల్లీ నిజాముద్దీన్‌లో తబ్లిగ్ […]

Update: 2020-04-02 00:56 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాతంలోని మంగళగిరికి మరోసారి కరోనా భయం సోకింది. మూడు వారాల క్రితం అమెరికా నుంచి మంగళగిరి వచ్చిన దంపతులకు కరోనా సోకిందన్న వార్తతో కలకలం రేగింది. ఏనోట విన్నా వారి గురించిన పుకార్లే షికార్లు చేశాయి. వైద్యపరీక్షల్లో జెట్ లాగ్, ప్రాంత మార్పు వల్ల వారిలో జ్వరం వంటి లక్షణాలు కనిపించాయని, కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అప్పుడు రేగిన కలకలం సద్దుమణిగింది.

తాజాగా, ఢిల్లీ నిజాముద్దీన్‌లో తబ్లిగ్ జమాత్ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారికి కరోనా వైరస్ సోకుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రార్థనలకు మంగళగిరికి చెందిన ఒక వ్యక్తి వెళ్లగా అతనికి గతరాత్రి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అతనికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బాధితుడు నివసిస్తున్న టిప్పర్ బజార్‌లోని ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల పరిధిని రెడ్‌జోన్‌గా ప్రకటించారు.

కరోనా బాధితుడితో పాటు అతని ఐదుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని కూరగాయల దుకాణాలు, మార్కెట్లను మూసివేయించారు. ఆ పరిసరాల్లో 144 సెక్షన్ విధించి, ఆ ప్రాంతంలో హైఅలర్ట్‌ ప్రకటించారు. దీంతో అక్కడ చీమ చిటుక్కు మన్నా పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు. దీంతో మంగళగిరిలో నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది.\

Tags: corona virus; covid-19, mangalagiri, muslim, delhi travel record

Tags:    

Similar News