‘నమస్తే’కు ప్రపంచం సలాం

‘నమస్తే’.. ఈ పదానికి ప్రస్తుతం ప్రపంచమంతా సలాం కొడుతోంది. నిన్నటిదాకా భారత సాంప్రదాయంలో మాత్రమే భాగమైన ఈ అలవాటును.. నేడు ప్రపంచ దేశాలన్నీ ఆచరిస్తున్నాయి. సాధారణ పౌరుడి నుంచి దేశ ప్రథమపౌరుడి వరకూ నమస్తేను అలవాటుగా మార్చుకున్నారు. ఆరోగ్యానికి హ్యాండిచ్చే షేక్ హ్యాండ్లకు బదులు నమస్తే అంటూ పలకరించుకుంటున్నారు. ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వంటి అంటువ్యాధులకు కారణమయ్యే కౌగిలింతలకు ప్రత్యామ్నాయంగా చేతులు జోడించి గౌరవించుకుంటున్నారు. పేద, ధనిక, కులం, మతం, ప్రాంతం.. ఇలా భేదాలకతీతంగా మారింది మన […]

Update: 2020-03-14 08:00 GMT

‘నమస్తే’.. ఈ పదానికి ప్రస్తుతం ప్రపంచమంతా సలాం కొడుతోంది. నిన్నటిదాకా భారత సాంప్రదాయంలో మాత్రమే భాగమైన ఈ అలవాటును.. నేడు ప్రపంచ దేశాలన్నీ ఆచరిస్తున్నాయి. సాధారణ పౌరుడి నుంచి దేశ ప్రథమపౌరుడి వరకూ నమస్తేను అలవాటుగా మార్చుకున్నారు. ఆరోగ్యానికి హ్యాండిచ్చే షేక్ హ్యాండ్లకు బదులు నమస్తే అంటూ పలకరించుకుంటున్నారు. ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వంటి అంటువ్యాధులకు కారణమయ్యే కౌగిలింతలకు ప్రత్యామ్నాయంగా చేతులు జోడించి గౌరవించుకుంటున్నారు. పేద, ధనిక, కులం, మతం, ప్రాంతం.. ఇలా భేదాలకతీతంగా మారింది మన ‘నమస్తే’. కరోనా వైరస్‌పై మానవజాతి చేస్తున్న యుద్ధంలో గెలవాలంటే షేక్‌హ్యాండ్లను వీడి ‘నమస్తే’ పెట్టాల్సిందే. కౌగిలింతల పలకరింతలకు గుడ్ బై చెప్పి సంస్కారవంతమైన ‘నమస్కారం’ అనాల్సిందే.
ఇప్పుడిదే ట్రెండింగ్ బాసూ..!

Tags: namaste, carona, virus, covid-19, trump, world wide, namaste craze,

Tags:    

Similar News