కరోనాపై హైకోర్టు వ్యాఖ్యలు స్వాగతిస్తున్నాం..

దిశ, వెబ్ డెస్క్: కరోనా కేసుల విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు పదేపదే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కూడా మంగళవారం హైకోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో ప్రభుత్వానికి కోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో ప్రభుత్వంపై హైకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. […]

Update: 2020-07-28 08:51 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనా కేసుల విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు పదేపదే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కూడా మంగళవారం హైకోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో ప్రభుత్వానికి కోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో ప్రభుత్వంపై హైకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ప్రజల ఆవేదనకు, మనోభావాలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వేదిక అనే నమ్మకాన్ని కలిగించిందన్నారు. కరోనా మరణాలపై ఏబీఎన్ కథనాలను నమ్ముతున్నట్టు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు.

Tags:    

Similar News