కేసీ‌ఆర్‌కు ఊహించని షాక్.. 2026 తర్వాతే నియోజకవర్గాల పెంపు..?

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాల్సి ఉన్నప్పటికీ రాజ్యాంగంలోని 170వ అధికణానికి లోబడి ఆ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుందని కేంద్ర హోం శాఖ క్లారిటీ ఇచ్చింది. అందువల్ల 2026 సంవత్సరం తర్వాత పబ్లిష్ అయ్యే జనగణన నివేదిక […]

Update: 2021-08-03 02:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాల్సి ఉన్నప్పటికీ రాజ్యాంగంలోని 170వ అధికణానికి లోబడి ఆ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుందని కేంద్ర హోం శాఖ క్లారిటీ ఇచ్చింది.

అందువల్ల 2026 సంవత్సరం తర్వాత పబ్లిష్ అయ్యే జనగణన నివేదిక అనంతరమే అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని, ఇప్పట్లో పెంచే అవకాశం లేదని ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రంతో కలిపి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో సైతం అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ కొనసాగించే అవకాశం ఉందా అని రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పై విధంగా బదులిచ్చారు.

Tags:    

Similar News