ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడండి: కలెక్టర్ శరత్

దిశ, నిజామాబాద్: రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గించేందుకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా వైద్య సిబ్బంది చొరవ చూపాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రిలో ప్రసవాలు చేయించుకున్న మహిళలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల గురించి వివరించాలని సూచించారు. చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు 100 శాతం వేయించాలన్నారు. విధుల్లో […]

Update: 2020-04-16 04:28 GMT

దిశ, నిజామాబాద్: రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గించేందుకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా వైద్య సిబ్బంది చొరవ చూపాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రిలో ప్రసవాలు చేయించుకున్న మహిళలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల గురించి వివరించాలని సూచించారు. చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు 100 శాతం వేయించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు డెలీవరి కోసం వచ్చే గర్భవతుల సంఖ్యను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పగడ్బందీగా నిర్వహించాలన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు వైద్య సిబ్బంది చేస్తున్న కృషిని కలెక్టర్ అభినందించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేషశ్ దోతురే, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, వైద్యాధికారి చంద్రశేఖర్, జిల్లా నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం అధికారిణి విశాలరాణి, వైద్యులు, పర్యవేక్షకులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Tags: govt hospitals, deilivery cases, to control mother and child deaths, collecter sharath kumar

Tags:    

Similar News