రైతును లంచం అడిగిన తహసీల్దార్‌కు ఊహించని షాక్

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్: నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతు నుండి లంచం తీసుకుంటూ తహసీల్దార్, మరో ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. మండలానికి చెందిన ఓ రైతుకు సంబంధించి ఏడు రకాల డాక్యుమెంట్లు ఇవ్వడానికి అధికారులు లంచం డిమాండ్ చేయడంతో ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తు వ్యూహం ప్రకారమే రైతు ద్వారా అధికారులు డిమాండ్ చేసినా 12 వేల రూపాయల నగదును తహసీల్దార్ కార్యాలయంలో అందజేస్తున్న సమయంలో ఏసీబీ […]

Update: 2021-10-07 06:18 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్: నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతు నుండి లంచం తీసుకుంటూ తహసీల్దార్, మరో ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. మండలానికి చెందిన ఓ రైతుకు సంబంధించి ఏడు రకాల డాక్యుమెంట్లు ఇవ్వడానికి అధికారులు లంచం డిమాండ్ చేయడంతో ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తు వ్యూహం ప్రకారమే రైతు ద్వారా అధికారులు డిమాండ్ చేసినా 12 వేల రూపాయల నగదును తహసీల్దార్ కార్యాలయంలో అందజేస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. లంచం తీసుకుంటున్న తహసీల్దార్ శౌకత్ అలీ, వీఆర్ఏ కృష్ణ, కంప్యూటర్ ఆపరేటర్ శివ‌ను అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరుసగా తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది ఏసీబీకి పట్టుబడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది.

Tags:    

Similar News