సహచరులే బుకీల దగ్గరికి తీసుకెళ్లారు: క్రికెటర్ ఆకిబ్ జావెద్

దిశ, స్పోర్ట్స్: క్రికెట్‌లో ఫిక్సింగ్ వ్యవహారాలు ప్రస్తుతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఆకిబ్ జావెద్ తన సహచర ఆటగాడైన సలీమ్ పర్వేజ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు చేశాడు. క్రికెట్ ఆడే సమయంలో సలీమ్ జట్టులోని ఆటగాళ్లను బుకీల వద్దకు తీసుకెళ్లేవాడని, తనను కూడా అతనే తీసుకెళ్లాడని ఆరోపించాడు. అతని వల్లే తన కెరీర్ నాశనమైందని అన్నాడు. ‘బుకీల ద్వారా క్రికెటర్లకు ఖరీదైన కార్లు, డబ్బులను ఆఫర్ చేసేవారు. నన్ను కూడా ఫిక్సింగ్‌లో పాలుపంచుకోమన్నారు. […]

Update: 2020-06-22 05:30 GMT

దిశ, స్పోర్ట్స్: క్రికెట్‌లో ఫిక్సింగ్ వ్యవహారాలు ప్రస్తుతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఆకిబ్ జావెద్ తన సహచర ఆటగాడైన సలీమ్ పర్వేజ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు చేశాడు. క్రికెట్ ఆడే సమయంలో సలీమ్ జట్టులోని ఆటగాళ్లను బుకీల వద్దకు తీసుకెళ్లేవాడని, తనను కూడా అతనే తీసుకెళ్లాడని ఆరోపించాడు. అతని వల్లే తన కెరీర్ నాశనమైందని అన్నాడు.

‘బుకీల ద్వారా క్రికెటర్లకు ఖరీదైన కార్లు, డబ్బులను ఆఫర్ చేసేవారు. నన్ను కూడా ఫిక్సింగ్‌లో పాలుపంచుకోమన్నారు. అలా చేయకపోతే కెరీన్ నాశనం చేస్తామని హెచ్చరించారు. నేను వారి మాట వినకపోవడంతో అన్నట్లుగానే చేశారు. అందుకు నేనేం బాధపడటం లేదు. ఎందుకంటే నేను నా విలువలకు కట్టుబడి ఉన్నాను’ అని జావెద్ పాకిస్తాన్ మీడియాతో చెప్పాడు. కాగా, ఆకిబ్ జావెద్ ఆరోపణలు చేసిన సలీమ్ పర్వేజ్ 2013లోనే మృతిచెందాడు. మరోవైపు భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు ఇండియానే అడ్డా అని ఆరోపించాడు. ప్రతి మ్యాచ్ అక్కడి నుంచే ఫిక్సవుతుందని, ఐపీఎల్‌లో కూడా భారీగా ఫిక్సింగ్ జరుగుతున్నదన్నాడు.

Tags:    

Similar News