మైక్రోసాఫ్ట్ నుంచి మరో కొత్త కొవిడ్ యాప్

లాక్‌డౌన్ కారణంగా ఇంతకాలం ఇంటి దగ్గరి నుంచే పనిచేసిన ఉద్యోగులు ఇక ఆఫీసులకు తిరిగి రావాల్సిన సమయం వచ్చేసింది. కానీ కొవిడ్ 19 వైరస్ ఇంకా పూర్తిగా తొలగిపోని కారణంగా చాలా మంది ఉద్యోగులు అందుకు సంకోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీల యాజమాన్యాలు తమ ఉద్యోగులకు స్వచ్ఛమైన ఆరోగ్యహిత వాతావరణాన్ని అందించే ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్ ఒక కొత్త యాప్‌ను రూపొందించింది. దీని పేరు ప్రొటెక్ట్‌వెల్. యునైటెడ్ హెల్త్ గ్రూప్ సంస్థతో కలిసి మైక్రోసాఫ్ట్ ఈ యాప్‌ను రూపొందించింది. […]

Update: 2020-05-17 04:10 GMT

లాక్‌డౌన్ కారణంగా ఇంతకాలం ఇంటి దగ్గరి నుంచే పనిచేసిన ఉద్యోగులు ఇక ఆఫీసులకు తిరిగి రావాల్సిన సమయం వచ్చేసింది. కానీ కొవిడ్ 19 వైరస్ ఇంకా పూర్తిగా తొలగిపోని కారణంగా చాలా మంది ఉద్యోగులు అందుకు సంకోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీల యాజమాన్యాలు తమ ఉద్యోగులకు స్వచ్ఛమైన ఆరోగ్యహిత వాతావరణాన్ని అందించే ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్ ఒక కొత్త యాప్‌ను రూపొందించింది. దీని పేరు ప్రొటెక్ట్‌వెల్. యునైటెడ్ హెల్త్ గ్రూప్ సంస్థతో కలిసి మైక్రోసాఫ్ట్ ఈ యాప్‌ను రూపొందించింది.

ఒక ఉద్యోగి ఉద్యోగానికి వెళ్లడానికి కావాల్సిన ఆరోగ్య ప్రమాణాలను కలిగి ఉన్నాడా లేదా అనేది ఈ యాప్ ద్వారా తెలుస్తుంది. తనతో పాటు తన సహోద్యోగులు కూడా స్క్రీనింగ్ చేయించుకోవడంతో.. ఎలాంటి భయాలు, ఆందోళనలు లేకుండా ఆఫీసులకు వచ్చి పనిచేసుకునే సౌకర్యం కలుగుతుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సూచనలకు అనుగుణంగా ఈ యాప్‌ను రూపొందించారు. ఇందుకోసం యునైటెడ్‌ హెల్త్ గ్రూప్ వారి క్లినికల్ డేటా సామర్థ్యాన్ని మైక్రోసాఫ్ట్ ఉపయోగించుకుంది. కొవిడ్ 19 కట్టడిలో రెండో దశలో పాటించాల్సిన జాగ్రత్తలు ఇలాంటి యాప్ ద్వారానే సాధ్యం కానుండగా.. ఇది దాదాపు ఆరోగ్యసేతు యాప్‌లాగే పనిచేస్తుంది. కాగా దీని డేటా నియంత్రణ కంపెనీ యజమానుల చేతుల్లో ఉంటుంది.

Tags:    

Similar News