కుత్బుల్లాపూర్‌లో భారీ పేలుడు

దిశ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్‌లో భారీ పేలుడు సంభవించిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ సర్కిల్ భాగ్యలక్ష్మి కాలనీ లక్ష్మీ శైలజ హాస్పిటల్ వద్ద గుర్తు తెలియని యువకుడు (35) రెండు బ్యాగులు చేతిలో పెట్టుకొని వస్తున్నాడు. రాత్రి 9:30 గంటలకు ఒక్కసారిగా ఒక బ్యాగ్‌ను అక్కడ పడేయడంతో భారీ పేలుడు సంభవించింది. ఒక కిలోమీటరు మేర శబ్దం రావడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆత్మాహుతి దాడిలా […]

Update: 2021-05-11 11:36 GMT

దిశ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్‌లో భారీ పేలుడు సంభవించిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ సర్కిల్ భాగ్యలక్ష్మి కాలనీ లక్ష్మీ శైలజ హాస్పిటల్ వద్ద గుర్తు తెలియని యువకుడు (35) రెండు బ్యాగులు చేతిలో పెట్టుకొని వస్తున్నాడు. రాత్రి 9:30 గంటలకు ఒక్కసారిగా ఒక బ్యాగ్‌ను అక్కడ పడేయడంతో భారీ పేలుడు సంభవించింది. ఒక కిలోమీటరు మేర శబ్దం రావడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఆత్మాహుతి దాడిలా జరిగిందని స్థానికులు తెలియజేస్తున్నారు. కానీ అతనికి ఏమీ కాలేదు. కానీ పక్కనున్న దుకాణానికి సంబంధించిన నేమ్ బోర్డు ధ్వంసం అయింది. అనంతరం యువకుడు అక్కడి పారిపోతుండగా స్థానికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అక్కడే మరో బ్యాగు ఉండటంతో అందులో ఏముందో అని పోలీసులు డాగ్ స్క్వాడ్ తో పరిశీలిస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

 

Tags:    

Similar News