మహారాష్ట్ర పోలీసు అధికారిపై కేసు నమోదు

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ వీర్ సింగ్‌పై కేసు నమోదైంది. ఓ కేసులో ఆయన నిందితుడితో కలిసి బాధితులను వేధించారని, ఇతర అవినీతి పనులకు పూనుకున్నారన్న ఆరోపణలతో అకోలా జిల్లాలో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరమ్ వీర్ సింగ్ సహా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ డీసీపీ పరగ్ మనారే సహా 33 మందిపై అకోలా జిల్లా పోలీసు ఇన్‌స్పెక్టర్ భీమ్‌రావు గాడ్గే కేసు ఫైల్ చేశారు. నేరపూరిత కుట్ర, ఆధారాల […]

Update: 2021-04-28 23:48 GMT

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ వీర్ సింగ్‌పై కేసు నమోదైంది. ఓ కేసులో ఆయన నిందితుడితో కలిసి బాధితులను వేధించారని, ఇతర అవినీతి పనులకు పూనుకున్నారన్న ఆరోపణలతో అకోలా జిల్లాలో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరమ్ వీర్ సింగ్ సహా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ డీసీపీ పరగ్ మనారే సహా 33 మందిపై అకోలా జిల్లా పోలీసు ఇన్‌స్పెక్టర్ భీమ్‌రావు గాడ్గే కేసు ఫైల్ చేశారు. నేరపూరిత కుట్ర, ఆధారాల చెరిపివేత, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా మొత్తం 27 సెక్షన్‌ల కింద కేసు నమోదైంది. 2015 నుంచి 2018లో థానే పోలీసు చీఫ్‌గా ఉన్నప్పుడు పరమ్ వీర్ సింగ్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పరమ్ వీర్ సింగ్ అడుగుజాడల్లో నడవనందుకు తనపై ఐదు కేసులు మోపారని, తర్వాత సస్పెండ్ చేశారని తెలిపారు.

Tags:    

Similar News