వైన్ షాపుల్లో పెరుగుతున్న దొంగతనాలు

దిశ సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో దొంగలు హల్ చల్ చేస్తున్నారు. వైన్ షాపులు, ఫర్టిలైజర్ షాపులే టార్గెట్ గా దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండల కేంద్రంలోని ఓ వైన్ షాప్, ఫర్టిలైజర్ షాప్ లో చోరీకి పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా చిన్నకోడూర్ మండల కేంద్రంలో రెండు షాప్ లలో దొంగలు పడిన ఘటన కలకలం రేపింది. సంఘటనా స్థలానికి చేరుకున్న చిన్నకోడూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. […]

Update: 2021-10-09 01:16 GMT

దిశ సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో దొంగలు హల్ చల్ చేస్తున్నారు. వైన్ షాపులు, ఫర్టిలైజర్ షాపులే టార్గెట్ గా దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండల కేంద్రంలోని ఓ వైన్ షాప్, ఫర్టిలైజర్ షాప్ లో చోరీకి పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా చిన్నకోడూర్ మండల కేంద్రంలో రెండు షాప్ లలో దొంగలు పడిన ఘటన కలకలం రేపింది. సంఘటనా స్థలానికి చేరుకున్న చిన్నకోడూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీస్ స్టేషన్ కి కూత వేటు దూరంలో ఉన్న రెండు షాపుల్లో ఈ దొంగతనం జరగడం గమనార్హం. దసరా పండుగ సీజన్ కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News