ఓటీటీలోకి రాబోతున్న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

2014లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. గీతాంజలి వచ్చి పదేళ్లు అయినప్పటికీ ఈ సినిమాకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

Update: 2024-05-06 07:45 GMT

దిశ, సినిమా: 2014లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. గీతాంజలి వచ్చి పదేళ్లు అయినప్పటికీ ఈ సినిమాకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇటీవల దీనికి సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ తెరకెక్కించారు. ఏప్రిల్ 11న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది.

ఇందులో అంజలి, షకలక శంకర్, సత్యం రాజేష్, అలీ, రాహుల్, సునీల్, రవికృష్ణ వంటి వారు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. అయితే గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా నెల రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. గీతాంజలి మళ్లీ వచ్చింది మే 8 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఆహా వారు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో సినీ ప్రియులు ఖుషీ అవుతున్నారు.

Similar News