భారీ ధరకు అమ్ముడుపోయిన విజయ్ ‘ది గోట్’ సినిమా ఓటీటీ రైట్స్.. ఎన్ని కోట్లంటే?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, మీనాక్షి చౌదరి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. దీనికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు.

Update: 2024-05-22 14:20 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, మీనాక్షి చౌదరి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. దీనికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ప్రస్తుతం ది గోట్ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా, ది గోట్ ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీని డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ. 110 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీ కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Similar News