ఓటీటీలోకి ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ కమోడియన్‌గా, హీరోగా వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

Update: 2024-05-27 06:37 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ కమోడియన్‌గా, హీరోగా వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే కామెడి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనిని మల్లి అంకం తెరకెక్కించగా.. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా మే3న థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ విజయం సాధించలేకపోయింది.

తాజాగా, ఆ ఒక్కటి అడక్కు సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు సమాచారం. ఈ మూవీ ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. మే 30 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులో ఉంచడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన సినీ ప్రియులు సంతోషపడుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

Similar News