Lok Sabha Elections 2024: వీల్ ఛైర్‌లో వచ్చి ఓటు వేసిన సీఎం కుమారుడు..

ప్రజాస్వామ్య రక్షణలో ఓటు కీలక పాత్ర పోషిస్తుంది.

Update: 2024-05-07 06:07 GMT

దిశ వెబ్ డెస్క్: ప్రజాస్వామ్య రక్షణలో ఓటు కీలక పాత్ర పోషిస్తుంది. కనుక ఓటు వేయడం దేశంలోని ప్రతి ఒక్క పౌరుడి భాధ్యత. అయితే మనలో కొంతమంది అన్నీ సక్రమంగా ఉన్న ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వాళ్లకు ఓటు విలువ తెలిసేలా చేశారు ఓ సీఎం కుమారుడు. వీల్ ఛైర్‌లో వచ్చి ఓటు వేశారు. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్ కుమారుడు అనూజ్ పటేల్ గత ఏడాది బ్రయిన్ స్ట్రోక్‌కు గురైయ్యారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే నేడు గుజరాత్‌లోనూ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మూడో విడత పోలింగ్ జరుగుతూ ఉంది. కాగా ఈ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనూజ్ పటేల్ వీల్ ఛైర్‌లో పోలింగ్ కేంద్రానికి వచ్చారు.

అనంతరం ఎన్నికల సిబ్బంది సాయంతో ఆయన ఓటు వేశారు. కాగా నేడు 11 రాష్ట్రాల్లో మూడో విడత సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. 11 రాష్ట్రాల్లో జరుగుతున్న మూడో విడత సార్వత్రిక ఎన్నికల్లో 93 సీట్లకుగాను మొత్తం 1351 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.  

Similar News