దిల్‌సుఖ్‌నగర్ బాంబ్ బ్లాస్ట్‌పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ నగరం తనకు ఎంతో ప్రత్యేకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు.

Update: 2024-05-10 13:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరం తనకు ఎంతో ప్రత్యేకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పదేండ్ల క్రితం ఇక్కడే ఒక సభ పెట్టాను.. ఆ సభకు టికెట్ పెట్టామని గుర్తుచేశారు. ఆ సభ ఫలితాలను ప్రభావితం చేసింది. ఇప్పుడు కూడా ఈ సభ టర్నింగ్ పాయింట్ కాబోతోంది అన్నారు. తనకు ప్రజల మూడ్ ఏంటో తెలిసిపోయిందని అన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంను వద్దనుకుంటున్నట్లు చెప్పారు. జూన్ 4వ తేదీన ఏం జరుగుతుందనేది తనకు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. సీఏఏ, యూనిఫాం సివిల్ కోడ్, ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకించేవారు, అవినీతిపరులు ఓట్ జిహాద్ అనేవారు ఓడిపోతారని జోస్యం చెప్పారు. హైదరాబాద్ సొల్యూషన్ సిటీ.. ఇక్కడ ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు.

గతంలో దిల్‌సుఖ్ నగర్‌లో బాంబ్ బ్లాస్ట్ జరిగిన విషయం అందరికీ తెలసు.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రోజూ ఎక్కడో చోట బ్లాస్ట్‌లు జరుగుతూనే ఉండేవని అన్నారు. ఒక ఫ్యామిలీ రెస్టారెంట్‌కు వెళ్లి తిందామంటే బ్లాస్ట్ జరుగుతుందనే భయం ఉండేదని అన్నారు. మూవీకి వెళ్లినా, బస్సులో ప్రయాణించినా భయం ఉండేదని చెప్పారు. కానీ ఈ పదేళ్లలో ఎప్పుడూ అలాంటి పరిస్థితి రాలేదని అన్నారు. అందుకే మరోసారి బీజేపీకి ఓటు వేయాలని రిక్వెస్ట్ చేశారు. ఇది కాంగ్రెస్ కూటమికి నచ్చడం లేదు. అందుకే మోడీని రాకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే.. మళ్లీ పాత రోజులు వచ్చినట్లే.. అందుకే దేశంలో ఉగ్రవాదులను ఎంటర్ కానివ్వొద్దు అని అన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News