AP elections 2024: పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు.. ఏంటంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

Update: 2024-05-26 06:34 GMT

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. అయితే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఓటును పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారు. కాగా ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతుండడంతో ఫలితాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో తాజాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీ కీలక సూచనలు చేసింది. గెజిటెడ్ అధికారి స్టాంప్ వేయలేదనే కారణంతో పోస్టల్ బ్యాలెట్‌ ఓటును చెల్లని ఓటుగా పరిగణించవద్దని, గెజిటెడ్ అధికారి స్టాంప్ లేకపోయినా ఓటు చెల్లుతుందని పేర్కొంది.

Similar News