డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ అయిన డేవిడ్ వార్నర్ కు ఆ దేశంలో కంటే భారత్ లోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Update: 2024-04-28 10:21 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ అయిన డేవిడ్ వార్నర్ కు ఆ దేశంలో కంటే భారత్ లోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐపీఎల్ లో అతను అత్యధికంగా సన్ రైజర్స్ జట్టులో ఆడగా ఆతన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ జట్టులో ఆడుతున్నప్పటికి వార్నర్ కు తెలుగు రాష్ట్రాలు, సినిమాలపై అమితమైన ప్రేమ చూపిస్తునే ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తెలుగులో హిట్ అయిన సినిమా డైలాగ్స్, సాంగ్స్ తో వార్నర్ రచ్చ చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. 2024 సీజన్ లో ఢిల్లీ తరుఫున ఆడుతున్న వార్నర్ గాయం కారణంగా మూడు కంటే ఎక్కువ మ్యాచులకు దూరం అయ్యాడు. దీంతో వార్నర్ గాయం నుంచి కోలుకుని కీలక సమయంలో జట్టులోకి వస్తాడని అంతా భావించారు.

కానీ అతను గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్ ఫిట్‌నెస్ తిరిగి పొందడానికి మరో వారం సమయం పడుతుందని ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే తెలిపారు. దీంతో వార్నర్ ఫ్యాన్స్ షాక్ తిన్నారు. కీలక ప్లే ఆఫ్ రేసులో వార్నర్ వస్తాడని ఆవించి భంగపడ్డారు. కాగా మరోపక్క సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కూడా గాయం నుంచి కోలుకోవడానికి మరోవారం సమయం పడుతుండడంతో ఇరువురు ప్లేయర్లు మరో 2 మ్యాచులకు దూరం అయ్యే అవకాశం కల్పిస్తుంది. ఈ సీజన్ లో తీవ్ర ఒడిదుడుకులను చూసి ఢిల్లీ జట్టు వరుసగా రెండు విజయాలను సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్ రేసు ఆశలను సజీవం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ తదుపరి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో కోల్‌కతాలో, మే 7న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.

Similar News