ఐపీఎల్ నుంచి ఆర్సీబీ ఎలిమినేట్.. అనుష్క శర్మ ఎమోషనల్ వీడియో వైరల్

ఐపీఎల్ 2024 నుంచి ఆర్సీబీ ఎలిమినేట్ అయింది. బుధవారం రాజస్థాన్, బెంగళూరు మధ్య నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ 2 మ్యాచులో ఆర్సీబీ జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది.

Update: 2024-05-23 04:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 నుంచి ఆర్సీబీ ఎలిమినేట్ అయింది. బుధవారం రాజస్థాన్, బెంగళూరు మధ్య నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ 2 మ్యాచులో ఆర్సీబీ జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో గత 17 సీజన్లుగా టైటిల్ గెలవాలని ఆశతో ఉన్న ఆర్సీబీ జట్టుకు ఈ సీజన్‌లోను పరాభవం తప్పలేదు. వరుసగా 6 మ్యాచుల్లో విజయం సాధించి ప్లే ఆఫ్ చేరిన ఆ జట్టు కీలక మ్యాచులో ఓడిపోయి ఇంటికి వెళ్లడం ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్రంగా బాధించింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ చివర్లో కోహ్లీ భార్య అనుష్క శర్మ ఎమోషనల్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓటమి తర్వాత మైదానంలో ఉన్న ఆర్సీబీ ప్లేయర్లు అందరూ కన్నీరు పెట్టారు. ఇది చూసిన అనూష్క శర్మ కూడా దాదాపు కన్నీరు పెట్టడం ఆ వీడియోలో కనిపించింది. దీంతో ఆ వీడియోను ఆర్సీబీ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మాకు అన్ని సందర్భాల్లో సపోర్ట్ గా నిలుస్తున్న వదినమ్మకు రుణపడి ఉంటామని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్ చేరుకుని ఎలిమినేట్ కావడం ఇది మూడోసారి.

Full View

Similar News