2024 ఐపీఎల్ ఫైనల్‌కు వర్షం ముప్పు

ఐపీఎల్ 2024 చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ రోజు(ఆదివారం) సాయంత్రం ఫైనల్ మ్యాచ్ కలకత్తా, సన్ రైజర్స్ జట్ల మధ్య చెన్నై లోని చపాక్ స్టేడియంలో జరగనుంది.

Update: 2024-05-26 08:54 GMT

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2024 చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ రోజు(ఆదివారం) సాయంత్రం ఫైనల్ మ్యాచ్ కలకత్తా, సన్ రైజర్స్ జట్ల మధ్య చెన్నై లోని చపాక్ స్టేడియంలో జరగనుంది. అయితే ఫ్యాన్స్ ఆందోళన చెందినట్లుగానే వాతావరణ శాఖ బాంబు పేల్చింది. ఈ రోజు మ్యాచ్ జరిగే సమయంలో చెన్నై లో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. అలాగే నిన్న మధ్యాహ్నం కూడా చపాక్ స్టేడియంలో మోస్తారు వర్షం కురిసింది. దీంతో కలకత్తా ప్లేయర్లు తమ ప్రాక్టీస్ సెషన్ ను రద్దు చేసుకున్నారు. అయితే ఈ రోజు పూర్తిగా వర్షం పడినప్పటికీ రేపటికి రిజర్వ్ డే ఉంది. ఈ నెల 26 చెన్నై‌లో వర్షం పడే అవకాశాలు అసలు లేవని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్ లో ఇరు జట్లు భారీ విజయాలతో ఫైనల్ వరకు చేరుకున్నారు. ఐపీఎల్ మొత్తంలో కలకత్తా జట్టు ఫైనల్ చేరడం ఇది నాలుగో సారి కాగా.. రెండు 2012, 2014లో టైటిల్ విజేతగా నిలిచింది. మరోపక్క హైదరాబాద్ జట్టు కూడా ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి.. ఇందులో 2009, 2016 సంవత్సరంలో హైదరాబాద్ జట్టు టైటిల్ సాధించింది. మరి ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఎవరు గెలిచి మూడో టైటిల్‌ను కైవసం చేసుకుంటారో తెలియాంటే రాత్రి వరకు వేచి చూడాల్సిందే మరి.

Similar News